11 మంది మంత్రుల ఓటమి !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఎన్ని వ్యూహాలు పన్నినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. కాంగ్రెస్ ధాటికి బీజేపీ మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఏకంగా 136 సీట్లు గెల్చుకుంది. మరోసారి అధికారం చేజిక్కించుకుంటామని భావించిన బీజేపీ కేవలం 64 స్థానాలకు పరిమితమైంది. కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతామని ప్రకటనలు చేసిన జేడీఎస్ 20 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కేబినెట్ మంత్రులు సైతం కాంగ్రెస్ దెబ్బకు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో తాజా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సహా 12 మంది మంత్రులు విజయం సాధిస్తే 11 మంది మంత్రులు మాత్రం ఓడిపోయారు. హిజాబ్ ఆందోళనను పెంచి పోషించడమే కాకుండా విద్వేషపూరిత వ్యాఖ్యలతో సంచలనం రేపిన మరో మంత్రి బీసీ నగేష్ సైతం ఓడిపోయారు. ఓడిపోయిన మంత్రుల్లో రాజరాజేశ్వరి నగర్ నుంచి మునిరత్న, ఎల్లాపూర్ నుంచి శివరామ్ హెబ్బార్, వరుణ నుంచి వి సోమన్న, బళ్లారి నుంచి బీఎస్ శ్రీరాములు, చిక్కనాయకపల్లి నుంచి మధుస్వామి, ముథోల్ నుంచి గోవింద కరజోల్, చిక్ బళ్లాపూర్ నుంచి కే సుధాకర్, హోస్కోట్ నుంచి ఎంటీబీ నాగరాజ్, హీరేకెరూర్ నుంచి బీసీ పాటిల్, బీళగి నుంచి మురుగేష్ నిరాణి తో పాటు బీసీ నగేశ్, శంకర్ పాటిల్ తదితరులు వున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)