గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 8 May 2023

గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర !


2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్ర కాంగ్రెస్ శాఖలో తిరుగుబాటుతో ఆయన రగిలిపోతున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయని వసుంధర రాజే అన్నారు. 'నాపై గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర. గెహ్లాట్ అవమానించినంతగా నన్నెవరూ అవమానించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అబద్ధాలు చెబుతున్నారు. సొంత పార్టీలోని తిరుగుబాటు కారణంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని వసుంధర రాజే తెలిపారు. ధోల్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన గెహ్లాట్ 2020 సంక్షోభాన్ని బిజెపి ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు కుట్ర పన్నారని, వసుంధర రాజే, మాజీ అసెంబ్లీ స్పీకర్ కైలాశ్ మేఘవాల్, ఎంఎల్‌ఏ శోభారాణి కుష్వాహా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అనుకూలంగా వ్యవహరించలేదని అన్నారు. 

No comments:

Post a Comment