సాక్ష్యాలు లేవని కోర్టే చెప్పింది !

Telugu Lo Computer
0


ఎక్సైజ్ పాలసీ స్కామ్ తప్పుడు కేసు అని, నిజాయితీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీపై బురద చల్లేందుకు బీజేపీ సాగిస్తున్న నిరంతరం ప్రయత్నాలో ఇదొక భాగమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ముడుపులు తీసుకున్నట్టు కానీ, మనీ లాండరింగ్ జరిగినట్టు కానీ సాక్ష్యాలు లేవని ఇప్పుడు కోర్టు కూడా చెప్పిందని తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇద్దరు నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు ఆదివారంనాడు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే కేజ్రీవాల్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయంటూ ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో నిందితులపై ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ ఈ కేసులో నిందితులైన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ''లిక్కర్ కుంభకోణం మొత్తం బోగస్. మొదట్నించీ ఈమాట మేము చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు కోర్టులు కూడా అదే మాట చెబుతున్నాయి. ఆప్ వంటి నిజాయితీ కలిగిన పార్టీపై నిరంతరం బురదచల్లే ప్రయత్నం బీజేపీ చేస్తోంది'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)