ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ప్రత్యేక విమానం !

Telugu Lo Computer
0


మణిపూర్‌లో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు తీవ్ర రూపం దాల్చాయి. అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ శాఖతో మాట్లాడి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయానశాఖ అధికారులు తెలిపారు. ఇంఫాల్ నుంచి కోల్ కతా మీదుగా విజయవాడకు విమానం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది ఏపీ విద్యార్థులు మణిపూర్ లో ఉన్నట్లు గుర్తించారు. ఏపీ భవన్ లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అక్కడున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఏ సమాచారానికైనా కంట్రోల్‌ రూంలోని 011-23384016, 011-23387089 హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చని ఏపీ భవన్‌ అధికారులు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)