అభివృద్ధి కోసం తండ్రి సమాధిని తొలగించిన నవీన్ పట్నాయక్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 18 May 2023

అభివృద్ధి కోసం తండ్రి సమాధిని తొలగించిన నవీన్ పట్నాయక్ !


ఒడిశా లోని పూరీ అంతర్జాతీయ యాత్రీకులను ఆకర్షించే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో అభివృద్ది కోసం నగర సుందరీకరణ కోసం తండ్రి సమాధి అడ్డుకాకూడదనే ఉద్ధేశంతో దాన్ని తొలగించాలని నవీన్ పట్నాయక్ ఆదేశించారని దుబాయ్‌లో మంగళవారం నిర్వహించిన ఒడిశా దివస్ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న పాండ్యన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలకు మేలు జరుగుతుంది అంటూ దేన్నైనా ఆయన ఎదుర్కొంటారని..అభివృద్ది విషయంలో ఎటువంటి రాజీ పడరని తెలిపారు.కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సీఎం వెనుకాడరని పాండ్యన్ వెల్లడించారు. పూరీ మహాప్రస్థానం ఆధునికీకరణ పనులకు అడ్డంగా ఉన్న తండ్రి సమాధిని తొలగించాలని అధికారులను సీఎం ఆదేశించారని ఈ సందర్భంగా పాండ్యన్ గుర్తు చేసుకున్నారు. తనకు నవీన్ పట్నాయక్ తో 13ఏళ్లకు పైగా అనుబంధం ఉందని ఆయన ప్రైవేట్ సెక్రటరీ పాండ్యన్ తెలిపారు. ఇప్పుడు స్వర్గద్వారలో బిజు పట్నాయక్ స్మారక చిహ్నం కేవలం చిన్న ఫలకం మాత్రమే ఉందని తెలిపారు. తన తండ్రి ఓ సమాధిలోనే ఉండరని తన గుండెల్లో ఎప్పటికి ఉంటారని సమాధిని తొలగించాలని ఆదేశించిన సందర్భంగా నవీన్ పట్నాయక్ అన్నారని పాండ్యన్ వెల్లడించారు. నవీన్ పట్నాయకే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే మాట చెప్పారని తెలిపారు. నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ మృతి తర్వాత 17 ఏప్రిల్ 1997లో స్వర్గద్వార్‌లో భారీ సమాధిని నిర్మించారు. దీని వల్ల అక్కడున్న స్థలం తగ్గిపోయి ఇబ్బందులు తలెత్తుతుండడంతో దానిని తొలగించాలని సీఎం స్వయంగా ఆదేశించినట్టు పాండ్యన్ తెలిపారు.

No comments:

Post a Comment