కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

Telugu Lo Computer
0


దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్‌లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు, టెర్రర్ ఫండింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించినది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో ఉగ్రవాదులతో సంబంధాలున్న వారి ఇండ్లలో సోదాలు చేస్తోంది. మే 11న, కాన్సిపోరాలోని అబ్దుల్ ఖలిక్ రెగూ నివాసంలో, సయ్యద్ కరీమ్‌లోని జావిద్ అహ్మద్ ధోబీ బారాముల్లా జిల్లాలోని సంగ్రి కాలనీలోని షోయబ్ అహ్మద్ చూర్‌ ఇళ్లలో ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. ఏప్రిల్ 20న పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. భింబర్ గలీ నుంచి సాంగ్యోట్ కు ఆర్మీ వాహనం వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నవారిని గుర్తించేపనిలో ఎన్‌ఐఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మే 9న శ్రీనగర్, కుప్వారా, పూంచ్, రాజౌరితో సహా పలు ప్రాంతాల్లో దాడులు జరిపారు. పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేర నకిలీ పేర్లతో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల కుట్రను ఛేదించేందుకు అధికారులు సోదాలు నిర్వహించారు. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)