చెరో రెండున్నరేళ్లు ?

Telugu Lo Computer
0


కర్నాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని తేల్చుకోవడం ఇబ్బందికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఆదివారం బెంగళూరులోని ఓ హోటల్ లో నిర్వహించిన సీఎల్పీ సమావేశం అనంతరం సీఎం ఎవరన్నది తేలిపోతుందని భావించినా అది జరగలేదు. దీంతో బాల్ ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కోర్టుకు చేరింది. పార్టీ సంప్రదాయం ప్రకారం సీఎంను ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సీఎల్‌పీ ఏకవాక్య తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. పార్టీని విజయతీరానికి చేర్చిన కాంగ్రెస్‌ అగ్రనేతలకు, ప్రజలకు మరో తీర్మానంలో కృతజ్ఞతలు చెప్పారు. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో, పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6.5 కోట్ల కన్నడిగులకు సేవలందిస్తామని తీర్మానంలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు చెరో రెండున్నరేండ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య ఓకే చెప్పినా డీకే శివకుమార్‌ మాత్రం నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం ఖర్గే, రాహుల్‌ గాంధీతో సీఎం అభ్యర్థులిద్దరూ భేటీ కానున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)