రాహుల్ గాంధీకి కమల్ హాసన్ శుభాకాంక్షలు !

Telugu Lo Computer
0


తమిళ స్టార్ కమల్ హాసన్ కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై స్పందించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ''రాహుల్ గాంధీ జీ, ఈ విజయాన్నికి హృదయపూర్వక అభినందనలు, గాంధీలాగే మీరు కూడా ప్రజల హృదయాల్లోకి వెళ్లారు. మీ సౌమ్యమార్గం ప్రజల్ని కదిలించగలదని నిరూపించారు. ప్రేమ, మానవత్వంతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. మీ విశ్వసనీయత, ధైర్యసాహసాలు, శ్రేయోదాయమైన విధానం ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించింది. మిమ్మల్ని విశ్వసించి విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. కేవలం విజయానికే కాదు, విజయం సాధించిన తీరుకు కూడా వందనాలు'' అని ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)