పిల్లిని పోలిన జంతువు ఎదుట మ్యాజిక్‌ ప్లే ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 1 May 2023

పిల్లిని పోలిన జంతువు ఎదుట మ్యాజిక్‌ ప్లే !


చిన్న జంతువు ఎదుట ఓ వ్యక్తి గారడీని ప్రదర్శించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను బ్యూటెంగేబీడెన్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ క్లిప్‌లో ఓ వ్యక్తి పిల్లిని పోలిన జంతువు ముందు మేజిక్ ప్లే చేయడం కనిపిస్తుంది. క్వోకాస్‌గా పిలిచే ఈ తరహా పిల్లులు సాధారణంగా న్యూజిలాండ్‌లో కనిపిస్తుంటాయి. వీటిని అత్యధిక సంతోషకర జంతువులుగా పరిగణిస్తారు. ప్రొఫెషనల్ మెజీషియన్ లూక్ ఫారెస్టర్ తొలుత షేర్ చేశారు. ఈ వీడియోలో జంతువు ముందు ఆ వ్యక్తి తన గారడీ నైపుణ్యాలను ప్రదర్శించడం చూడొచ్చు. అతడి కళతో జంతువు ఆశ్చర్యానికి లోనవడం కనిపిస్తుంది. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి 6.8 లక్షల మందికి పైగా వీక్షించారు. పెద్ద సంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. మెజీషియన్ ముందు గందరగోళానికి గురైనట్టు కనిపించిన జంతువు ఆపై సంతోషంతో నవ్వులు చిందించిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

No comments:

Post a Comment