యజమానికి తెలియకుండా బెడ్‌రూంలో సీక్రెట్‌ కెమెరా !

Telugu Lo Computer
0


పనిమనిషి తనకు తెలియకుండా బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని గురుగ్రాంలో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై తన ప్రైవేటు వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి రూ.2లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై వారు విచారణ చేపట్టారు. యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఈమె పని మనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు బెడ్‌రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేటు వీడియోలను సేకరించాడు. అయితే గతవారం ఇల్లు శుభ్రం చేసే సమయంలో యజమానికి సీక్రెట్ కెమెరా కన్పించింది. దీంతో వెంటనే పని మనిషిని పనిలోనుంచి తీసేసింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదునే భయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ పనిమనిషి డబ్బుకోసం యజమానిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆమె ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)