కమలం తరహాలో రాజ్యసభ ఛాంబర్​

Telugu Lo Computer
0


జాతీయ పుష్పం కమలం తరహాలో రాజ్యసభ చాంబర్​ను డిజైన్ చేశారు. మునుపటి రాజ్యసభ కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. కొత్త రాజ్యసభలో 384 సీట్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రాజ్యసభ సభ్యులు పెరిగినా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సీటింగ్ కెపాసిటీని పెంచారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్​ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ప్రోగ్రామ్ షెడ్యూల్​ను కూడా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంట్ కొత్త భవనం లోని లోక్​సభ, రాజ్యసభ కాంప్లెక్స్​కు సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ శుక్రవారం తన ట్విట్టర్​లో పోస్టు చేశారు. ఎంట్రీ నుంచి లోపల స్పీకర్, చైర్మన్​ కూర్చునే చైర్ వరకు ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చిత్రించారు. ఉభయ సభల్లో అశోక చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'మై పార్లమెంట్ మై ప్రైడ్' అనే హ్యాష్​ట్యాగ్​ను ఉపయోగించి వీడియోను అందరితో పంచుకోవాలని ప్రజలను మోడీ కోరారు. వీడియోకు వాయిస్ ఓవర్ జోడించాలని, అందులో కొన్నింటిని తాను రీట్వీట్ చేస్తానన్నారు. ఈ భవనాన్ని 15 ఎకరాల్లో త్రిభుజాకారంలో నిర్మించారు. పార్లమెంట్ భవనం విస్తీర్ణం 64,500 చదరపు మీటర్లు (15 ఎకరాలు), త్రిభుజాకారం, మూడంతస్తులు (పాత పార్లమెంట్ భవనానికి సమానంగా ఎత్తు ఉంటుంది). ప్రతి ఎంపీ సీటు ముందు మల్టీ మీడియా డిస్​ప్లే ఉంటుంది. ఎంపీలకు మొత్తం సీట్లు: 1,224, మీడియా కోసం 530 సీట్లు. జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అనే మూడు ద్వారాలు, కాన్​స్టిట్యూషన్ హాల్, విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఏర్పాటు

Post a Comment

0Comments

Post a Comment (0)