రాజేందర్‌ కుమార్‌ గుప్తా నివాసాలపై సీబీఐ దాడి !

Telugu Lo Computer
0


జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని వాప్‌కాస్‌ వాటర్ అండ్ సవర్ కన్సల్టెన్సీ మాజీ సీఎండీ రాజేందర్ కుమార్ గుప్తా నివాసాలపై సీబీఐ అధికారులు దాడి చేశారు. రాజేందర్‌ కుమార్‌ గుప్తా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఆయనకు చెందిన చెందిన 19 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుడ్‌గావ్‌, పంచకుల, సోనీపట్‌, చంఢీఘర్‌లోని నివాసాలతో సహా దేశవ్యాప్తంగా 19 ప్రదేశాల్లో జరిపిన ఈ తనిఖీల్లో రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం గుప్తాతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసులు నమోదు  చేశారు. గుప్తాకు చెందిన ఢిల్లీ, గుడ్‌గావ్‌, పంచకుల, సోనీపట్‌, చంఢీఘర్‌లోని ఇళ్లతో సహా దేశవ్యాప్తంగా 19 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.రూ.20 కోట్ల నగదుతో పాటు పలు ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, ఆభరణాలు, ఖరీదైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీగా నగదు స్వాధీనం కావటంతో అధికారులు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. కాగా.. వాప్‌కాస్‌ను గతంలో వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (ఇండియా)గా పిలవబడేది. ఇది జలశక్తి మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.

Post a Comment

0Comments

Post a Comment (0)