వెనక్కి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకెళ్లిన రైలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 22 May 2023

వెనక్కి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకెళ్లిన రైలు !


కేరళలోని అలప్పుజ జిల్లాలో షోరనూర్‌కు వెళ్లే వేనాడ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సోమవారం ఉదయం 7.45 గంటలకు చెరియనాడ్ అనే చిన్న రైల్వే స్టేషన్‌లో ఆగాల్సి ఉంది. అయితే లోకో పైలట్‌ రైలును ఆ స్టేషన్‌లో నిలుపలేదు. సుమారు 700 మీటర్ల దూరం వెళ్లిన తర్వాత జరిగిన పొరపాటును లోకో పైలట్‌ గుర్తించాడు. ఆ రైలును రివర్స్‌లో నడిపి స్టేషన్‌ వద్దకు చేర్చాడు. దీంతో ఆ రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు అందులోకి ఎక్కారు. కాగా, చిన్న రైల్వే స్టేషన్‌ చెరియనాడ్‌కు స్టేషన్‌ మాస్టర్‌ లేడని, అలాగే ఎలాంటి సిగ్నల్‌ కూడా అక్కడ లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్‌లో రైలు ఆపడంలో లోకో పైలట్‌ పొరపడినట్లు చెప్పారు. అయితే దీనిని వెంటనే గ్రహించి రైలును వెనక్కి నడిపి స్టేషన్‌ వద్దకు చేర్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎవరూ కూడా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదని తెలిపారు. అలాగే ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆ రైలు సకాలంలో గమ్యస్థానానికి చేరిందని రైల్వే అధికారులు చెప్పారు. అయినప్పటికీ ఆ స్టేషన్‌ వద్ద రైలును నిలుపని లోకో పైలట్ల నుంచి వివరణ కోరుతామని పేర్కొన్నారు.

No comments:

Post a Comment