ఢిల్లీ మెట్రోలో అందర్నీ అలరించిన చిన్నారి డ్యాన్స్‌ !

Telugu Lo Computer
0


ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఏదో ఒక న్యూస్ నిత్యం వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రేమ జంటలు ముద్దు పెట్టుకునే వీడియోలు, యువతుల డ్యాన్స్‌లు, రీల్స్‌తో హోరెత్తించారు. వీటిలో చాలామటుకు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాయి. ఈ దారుణాలు మేము చూడలేకపోతున్నామని గగ్గోలు పెట్టారు. ఇలాంటి తరుణంలో ఓ చిన్నారి బ్లూ కలర్ అవుట్ ఫిట్‌లో 'మిన్నా మిన్నా' డ్యాన్స్ చేసి అందర్నీ అలరించింది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. చక్కని డ్యాన్స్ మూమెంట్స్‌తో చిన్నారి అందరి మనసుని దోచుకుంది. కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులు సైతం ఆమె డ్యాన్స్‌ను ఎంజాయ్ చేశారు. ఇక ఈ వీడియోని somi_sharma01 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. వీడియో చూసిన వారంతా లవ్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. 'మిన్నా మిన్నా' పాటను గ్యారీ సంధు మరియు జోష్ సిద్ధూ పాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)