మోడీజీ బ్రిజ్‌ భూషణ్‌ని రాజీనామా చేయమని ఆదేశించండి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 1 May 2023

మోడీజీ బ్రిజ్‌ భూషణ్‌ని రాజీనామా చేయమని ఆదేశించండి !


కాంగ్రెస్‌ ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర​ మోడీని ఉద్దేశిస్తూ న్యాయం మీ అంగీకారం కోసం ఎదురుచూస్తోందని ట్వీట్‌ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ శరణ్‌ సింగ్‌ ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ కోరితే తాను రాజీనమా చేస్తానని శరణ్‌ సింగ్‌ చెప్పారు. కాబట్టి మోడీజీ ఇప్పుడైన ఆ ఎంపీని రాజీనామా చేయాలని ఆదేశించండి అని ప్రియాంక్‌ గాంధీ అన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ జంతర్‌మంతర్‌ నుంచి నిరసనలు చేసిన ఏ ఒక్కరు ఇప్పటి వరకు న్యాయం పొందలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు కావాలంటే కోర్టు తలుపులు తట్టాలని అన్నారు. హర్యానా 90% మంది అథ్లెట్లు, సంరక్షకులు దేశంలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని విశ్వసిస్తున్నారు. హర్యానాలోని కొన్ని కుటుంబాలకు చెందిన వారు ఆరోపణలు చేస్తున్నారని, వారంతా ఒకే ప్రాంతానికి చెందిన వారని అన్నారు. హర్యానా నియోజకవర్గం కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా దీనికి కారణమని ఆయనే వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ రెజ్లర్లు రోజుకో డిమాండ్‌తో ముందుకు వస్తున్నారంటూ విమర్శించారు. మొదట ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు. తర్వాత పదవికి రాజీనామా, జైలుకి పంపించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ తాను పదవికి రాజీనామ చేస్తే రెజ్లర్లు చేసిన ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందన్నారు. అందువల్ల తానను చేయనని కరాకండీగా చెప్పారు. అయినా తాను ప్రజల వల్ల తన నియోజకవర్గానికి ఎంపీ అయ్యానని, వినేష్‌ ఫోగట్‌ వల్లకాదని అన్నారు. కేవలం ఆ ఒక్క రాష్టానికి చెందిన కొన్ని కుటుంబాల అమ్మాయిలు మాత్రమే ఎందుకు నిరసనలు చేస్తున్నారని నిలదీశారు. మిగతా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హర్యానాకు చెందిన 90 శాతం మంది ఆటగాళ్లు తనతోనే ఉన్నారని శరణ్‌ సింగ్‌ చెప్పారు. కాగా, రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత శరణ్‌సింగ్‌పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. 

No comments:

Post a Comment