ఈవీఎంలు పగులగొట్టి ఎన్నికల సిబ్బందిపై దాడి చేసిన గ్రామస్తులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 10 May 2023

ఈవీఎంలు పగులగొట్టి ఎన్నికల సిబ్బందిపై దాడి చేసిన గ్రామస్తులు !


కర్ణాటక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు ఉదయాన్ని పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఓటు వేశారు. ఉదయం 7.00గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నాం వరకు మందకొడిగా కొనసాగిన పోలింగ్ ఆ తరువాత పుంజుకుంది. మధ్యాహ్నాం నుంచి యువత పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ క్రమంలో విజయపుర జిల్లాలోని బసవన్ బాగేవాడి తాలూకు మసబినళ గ్రామంలో స్థానికులు ఎన్నికల అధికారులపై తిరగబడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడులకు దిగారు. బిసాన, దోనూరు గ్రామం నుంచి రిజర్వు చేసిన ఓటింగ్ యంత్రాలను తిరిగి విజయపురానికి తీసుకువస్తుండగా స్థానికులు అడ్డుకుని ఈ దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈవీఎం,వీవీ ప్యాడ్ యంత్రాలను వెనక్కి పంపించటంపై స్థానికులు ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. దానికి అధికారులు సరిగా స్పందించకపోవటంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ దాడులకు దిగినట్లుగా తెలిపారు. ఈ కేసులో 23 మందిని అరెస్టు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల కోసం రిజర్వ్ చేయబడిన ఈవీఎంలను తీసుకెళ్తున్న సెక్షన్ ఆఫీసర్ వాహనాన్ని గ్రామస్థులు ఆపి రెండు కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, మూడు వీవీప్యాట్‌లు ధ్వంసం చేశారని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. “సెక్టార్ ఆఫీసర్‌పై దాడి జరిగింది. 23 మందిని అరెస్టు చేశారు అని ఎన్నికల సంఘం పేర్కొంది. అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను మారుస్తున్నారనే పుకార్లు రావడంతో గ్రామస్థుల ఈ చర్యకు దిగారు.

No comments:

Post a Comment