భూమా అఖిలప్రియ అరెస్టు

Telugu Lo Computer
0


భూమా అఖిలప్రియను నంద్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం నంద్యాలకు తరలించారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియతోపాటు ఆమె అనుచరులపై అటెంప్ట్‌ టు మర్డర్ కేసులు నమోదుయ్యాయి. అఖిలప్రియ పీఏ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఉదయాన్నే ఆమె ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు నిన్నటి ఘటన, అక్కడి పరిణామాలపై ఆరా తీశారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఆదేశాలతోనే దాడి జరిగిందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. అఖిలప్రియతో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మరోవైపు నంద్యాల్లో ఏవీ సుబ్బారెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అదే పార్టీకి చెందిన అఖిలప్రియ వర్గం దాడి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏబీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో ఏబీ సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. నారాలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలలో కొనసాగుతోంది. ఈ యాత్రలో వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు.  తనపై దాడి చేయడంపై ఏబీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే డైరెక్ట్‌గా కక్ష తీర్చుకోవాలంటూ సవాల్ విసిరారు ఏవీ. మరోవైపు, ఈ ఘటనతో పరిస్థితి అదుపు తప్పడంతో పాదయాత్ర నుంచి సుబ్బారెడ్డిని  పోలీసులు పంపించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)