* మాటలతో ఆకట్టుకోవాలంటే మాట్లాడే అంశంపై పట్టుండాలి. కొంత సాధన చేయాలి. అప్పుడు భయపడకుండా ముందడుగు వేయగలరు.
* మాట్లాడేటప్పుడు ఎదుటివాళ్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షించేవి హావభావాలే. మనం చెప్పే విషయాలని ఎలాగూ ఒకటి.. రెండూ.. మూడు.. అంటూ పాయింట్లుగా వివరిస్తుంటాం కదా! ఆ ఒకటి.. రెండు అంటూ చేతివేళ్లనే చూపించండి. చెప్పే విషయాన్ని చేతులతో వ్యక్తపరచండి. దీనివల్ల మీరు చెప్పేది ఏదైనా సరే ఎదుటివారి దృష్టిని మరల్చనీయదు.
* సమావేశాల్లో సమన్వయకర్తగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు కంగారు పడకుండా ప్రణాళికతో ముందుకెళ్తే అన్నీ క్రమ పద్ధతిలో జరిగి పోతాయి. అయితే, దీన్ని నోటిమాటగా అనుకోవద్దు. ఓ పుస్తకంలో మీరు చేయాల్సిన ప్రతి పనీ ప్రారంభం నుంచి చివరి వరకూ రాసుకోండి. స్నేహితుల సాయమూ తీసుకోండి. కచ్చితంగా పూర్తి చేయగలరు.
* ప్రెజెంటేషన్లు ఇచ్చేప్పుడు సబ్జెక్టు వీలైనంత సూటిగా ఉండాలి. సింపుల్‌గా గ్రాఫిక్స్, ఇమేజ్‌లతో చూపించగలగాలి. ఇందుకు తగ్గట్లుగా సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు.
No comments:
Post a Comment