ప్రపంచంలో గొప్ప హ్యాకర్‌గా పేరు తెచ్చుకున్న కన్హయ శర్మ !

Telugu Lo Computer
0


కన్హయ శర్మ తండ్రి ఇండోర్ నగరంలో ఉపాధ్యాయ వృత్తిలో తమ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ కన్హయ శర్మ తన చిన్నతనంలోనే కేవలం రూ. 251సంపాదనతో ప్రారంభమై ఇప్పుడు ఐటీ అండ్ లీగల్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కంపెనీ స్థాపించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నాడు. కన్హయ శర్మ సరాఫా విద్యా నికేతన్‌లో 8వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ నిర్మాణ పనులకు అవసరమయ్యే సామాగ్రి కోసం కూలీలు ఎంతగానో కష్టపడేవారు. ఇది చూసి కన్హయ ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టాలని నిర్ణయించుకుని 30 రోజుల్లోనే అనుకున్న విధంగానే సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టాడు. దానిని సంస్థ వారికి యాభైవేల రూపాయలకు విక్రయించాడు. ఇప్పటికీ వారు సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తుండటం గమనార్హం. తాను 6, 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రపంచంతో చాలా సంబంధాలు ఉండేవని, కానీ ఏడో తరగతిలో ఆన్‌లైన్ సర్టిఫికేషన్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని కన్హయ తెలిపారు. అయితే ప్రస్తుతం న్యాయ సేవలకు ఐటీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని అందించే కంపెనీలను ప్రారంభించినట్లు తెలిపాడు. నేను చదువుకునే రోజుల్లో ఇంట్లో కేవలం ఒక సైకిల్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు 5 నుంచి 6 లగ్జరీ కార్లు ఉన్నాయని వెల్లడించాడు. కన్హయ శర్మ హ్యాకింగ్ నైపుణ్యాలను చూసి దేశవ్యాప్తంగా అనేక పెద్ద ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అతనితో చేరడానికి 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసినప్పటికీ వాటిని కన్హయ తిరస్కరించారు. ప్రస్తుతం ఇతడు వాప్‌గో అండ్ లీగల్251 వ్యవస్థాపకుడు & సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)