మై లేజీ బాయ్ : మలైకా అరోరా

Telugu Lo Computer
0

బాలీవుడ్ హాట్ హీరోయిన్ మలైకా అరోరా  హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పెళ్లి అయ్యి ఒక బిడ్డ ఉన్న మలైకా, అర్జున్ కపూర్ తో లివింగ్ రిలేషన్ లో ఉంది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయే తప్పా ఈ జంట కన్ఫర్మ్ చేసింది లేదు. ఇక వీరి రిలేషన్ గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. వారు ఆ మాటలను పట్టించుకోకుండా తమ రిలేషన్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక నిత్యం అర్జున్ కపూర్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండే మలైకా తాజాగా ఒక ఫోటో ను షేర్ చేసి నెటిజన్ల చేత బూతులు తిట్టించుకుంటుంది. అంతగా ఆమె షేర్ చేసిన ఫోటోలో ఏముంది అంటే  తన ప్రియుడు, హీరో అర్జున్ కపూర్ నగ్న ఫోటో. కేవలం దిండును మాత్రమే అడ్డుపెట్టుకొని అర్జున్ కపూర్ ఒళ్ళు విరుచుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ  మై లేజీ బాయ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నీకసలు బుద్ది ఉందా ? అతను ఒక హీరో ఇలాంటి ఫోటోలు షేర్ చేసి అతని పరువు తీయాలనుకుంటున్నావా..? అని కొందరు. ఛీఛీ.. బెడ్ రూమ్ లో జరిగిన అన్ని విషయాలను పంచుకోవడమే కాకుండా ఫోటోలను కూడా షేర్ చేస్తున్నావా అని ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. మరికొందరు అయితే.. అతడి పరువును బజారుకీడ్చేవరకు ఈమె ఇలానే చేస్తుంది. ఇలాంటి ఫోటో షేర్ చేశావ్.. రేపు అతడు బయట ఎలా తిరగగలుగుతాడు అంటూ ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఫోటోపై అర్జున్ కపూర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)