గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హెచ్చరిక చేశారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయొద్దని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. 2014కి ముందు చేసిన తప్పిదాలు, 2019కి ముందు చేసిన తప్పిదాలు మళ్లీ చేయొద్దని అన్నారు. వాస్తవానికి 2013లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు కూడా ఘన విజయం సాధించి సిద్ధరామయ్య నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఏడాదిలోనే జరిగిన లోక్‫సభ ఎన్నికల్లో కాంగ్రె‭స్ పార్టీ దారుణ ఓటమి పాలయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఇదే జరిగింది. ఆ ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ లోక్‭సభ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఈ విషయాలను ప్రశాంత్ కిశోర్ ఉదహరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న కాంగ్రెస్ పార్టీ  లోక్‭సభ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపడం లేదని అన్నారు. ఈ పొరపాటు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చేయకూడదని సూచించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘననీయమైన స్థానాలు గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలు ఉండగా బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. దీన్ని పీకే ప్రస్తావిస్తూ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమాజ్‭వాదీ పార్టీ  రెండేళ్లకే జరిగిన లోక్‭సభ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలకే పడిపోయిందని, అదే సమయంలో బీజేపీకి 73 స్థానాలు కోల్పోయిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్ని, లోక్‭సభ ఎన్నికల మధ్య తలెత్తున్న ఈ లోపాలను పునపరిశీలించుకోవాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)