వెయిట్‌ లాస్‌ సంస్థ మేనేజరు అరెస్టు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 3 May 2023

వెయిట్‌ లాస్‌ సంస్థ మేనేజరు అరెస్టు


విజయవాడకు చెందిన వక్కపట్ల చంద్రశేఖర్‌ (40) కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లో వెయిట్‌ లాస్‌ పేరుతో నడుస్తున్న హెర్బల్‌ లైఫ్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ కూడా చేసేవాడు. బరువు తగ్గేందుకు ఎందరో మహిళలు అక్కడికి వచ్చేవారు. తమ సంస్థ ఉత్పత్తుల గురించి వివరిస్తానంటూ చంద్రశేఖర్‌ వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని వారితో చనువు పెంచుకున్నాడు. నిత్యం దాదాపు అందరితో ఫోన్లలో మాట్లాడేవాడు. ఆ క్రమంలో ఒంటరిగా ఉండే మహిళలను తన ముగ్గులోకి దింపి నగ్నంగా వీడియో కాల్స్‌ చేసేవాడు. వారినీ అలా చేయమనేవాడు. అర్ధరాత్రి వరకు వారితో మాట్లాడేవాడు. చాటింగ్‌ చేసేవాడు. అసభ్యకర పోస్టులు, ఫొటోలు పెట్టేవాడు. అలా తనకు నగ్నంగా వీడియో కాల్‌ చేయడం నచ్చని ఓ మహిళ చంద్రశేఖర్‌ను వారించినా వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్‌ పారిపోయి విజయవాడలో ఉంటున్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్‌పై గతంలో రాయదుర్గం ఠాణా పరిధిలో హత్యాయత్నం కింద కేసు నమోదైంది.

No comments:

Post a Comment