సంతలో మిరపకాయ బజ్జీలు తిని 60 మంది ఆసుపత్రిపాలు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండల కేంద్రంలో ప్రతీ శుక్రవారం సంత జరుగుతుంది. అక్కడికి తాండూర్ నుంచి వచ్చే ఓ వ్యక్తి మిర్చి, ఉల్లి బజ్జీలను అమ్ముతుంటాడు. ఎప్పటిలానే కొందరు ఆ సంతలో అతడి దగ్గర నుంచి మిర్చి, ఉల్లి బజ్జీలు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లారు. ఆపై వాటిని లొట్టలేసుకుంటూ తిన్నారు. అంతే! రాత్రి అయ్యేసరికి వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు 60 మంది వరకు ఆసుపత్రిలో పాలవ్వగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. కాగా, కలుషితమైన ఆహారం తినడం వల్ల వారంతా అస్వస్థతకు గురయ్యారని ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రజలు బయట ఆహారం తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ హర్ష సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)