ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాటలో 12 మంది మృతి

Telugu Lo Computer
0


శాన్ సాల్వడార్‌లోని కస్కట్లాన్ ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా ప్రేక్షకులు స్టేడియంలోకి దూసుకురావడంతో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు సెంట్రల్ అమెరికన్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. శనివారం రాత్రి అలియాంజా ఎఫ్‌సీ, క్లబ్ డిపోర్టివో ఎఫ్ఎఎస్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కస్కట్లాన్ స్టేడియం 44 వేల మందికి పైగా మ్యాచ్‌ను వీక్షించేందుకు వీలుంటుంది. మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఆటను నిలిపివేశారు. కస్కట్లాన్ స్టేడియంలో జరిగిన సంఘటనలకు సాల్వడోరన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని సంస్థ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ ఘటనపై ఆరోగ్య మంత్రి ఫ్రాన్సిస్కో అలబి మాట్లాడుతూ.. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన వారిలోఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.


Post a Comment

0Comments

Post a Comment (0)