కేరళ తీరంలో రూ.12 వేల కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత

Telugu Lo Computer
0


అరేబియన్‌ సముద్రంలో కేరళ తీర ప్రాంతం కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో రూ.12 వేల కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సముద్ర తీరం వెంబడి డ్రగ్స్‌ రవాణా జరుగుతుందని 15 రోజుల క్రితం సమాచారం అందింది. ఈ మేరకు నార్కోటిక్స్‌ నియంత్రణ విభాగం (ఎన్సీబీ), భారత నేవీ సంయుక్తంగా జరిపిన ఈ దాడిలో అరేబియన్‌ సముద్రంలో ఇరాక్‌ నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా నౌకలో రవాణా అవుతున్న 2500 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు. నౌకలో ఉన్న పాకిస్థాన్​కు చెందిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్​సీబీ అధికారులు తెలిపారు. ఇంతకుముందెప్పుడూ ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేదని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. 134 బస్తాల మెథాంఫేటామిన్​ను సీజ్ చేశామని, పాకిస్థాన్, ఇరాన్ మధ్య ఉన్న మక్రాన్ తీరంలో మదర్​షిప్​ అనే పెద్ద నౌక చిన్న చిన్న ఓడల ద్వారా అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తోందని ఆ అధికారి వెల్లడించారు. ఆపరేషన్ సముద్రగుప్తలో భాగంగా ఈ భారీ అక్రమ రవాణాకు చెక్ పెట్టామన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)