సర్పంచ్ వినూత్న నిరసన !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని శంబాజీనగర్‌ జిల్లా పులంబ్రీ పంచాయతీ సమితి పరిధిలోని గోవరాయ్‌ పయాగ్‌ గ్రామ సర్పంచ్ మంగేష్ సాబడే, గ్రామంలో వ్యవసాయం చేయాలంటే నీటి సమస్య ఉంది. దీంతో రైతులతో కలిసి సర్పంచ్ మంగేష్ సాబడే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు తమ గ్రామానికి బావులు మంజూరు చేయాలని, అలా కొంతకాలం పోరాటం తరువాత ఎట్టకేలకు గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరు అయ్యాయి. ఒక్కో బావికి రూ.4లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం మొత్తం 20 బావుల్ని తవ్వుకోవటానికి మంజూరు చేసింది. కానీ దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకున్నాడన్నట్లుగా ఆ బావులు తవ్వుకునే పనులు ప్రారంభించాలంటే స్థానిక అధికారుల అనుమతి ఇవ్వాలి. దీంతో సర్పంచ్ మంగేష్‌ బీడీవోను  కలిసి అనుమతి ఇవ్వాలని కోరాడు. దీనికి సదరు అధికారి మంజూరు అయిన దాంట్లో దాదాపు 12 శాతం తనకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి మా గ్రామంలో రైతులు పేదవారు, అంత డబ్బు ఇచ్చుకోలేరని దయచేసిన అనుమతి ఇవ్వాలని సర్పంచ్ విన్నవించుకున్నాడు. కానీ సరదు అధికారి డబ్బు ఇస్తేనే సంతకం చేస్తానని లేదంటే మంజూరు అయిన బావులు క్యాన్సిల్ అయిపోతాయని బెదరించాడు. దీంతో సదరు సర్పంచ్ కు కోపం వచ్చింది. ఇటువంటి అధికారులు బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. రూ.100, రూ.500 నోట్లతో ఓ దండ తయారు చేయించి దాన్ని మెడలో వేసుకుని మార్చి31న ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి, రోడ్డుమీద నిలబడి డబ్బు వెదజల్లాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. మంత్రి గిరీష్‌ మహాజన్‌ బీడీవోను సస్పెండ్‌ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. దీనిపై సర్పంచ్ మంగేష్ సాబడే మాట్లాడుతూ..ఎంతో కష్టపడి బావుల్ని మంజూరు చేసుకున్నాం. కానీ ఇటువంటి అధికారుల లంచగొండితనానికి రైతులు బలి అయిపోతున్నారు. నేను ఇలా వెదజల్లిన డబ్బులు పేద రైతుల నుంచి సేకరించిందేనని, కానీ ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇక రైతులు పరిస్థితి ఏంటీ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)