నాలుగు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు

Telugu Lo Computer
0


ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు నాలుగు రోజుల పాటు పడుతాయని హైదరాబాద్​లో  పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, రాత్రిపూట వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గొచ్చని చెప్పింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఆలంపూర్​లో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా ఘనపూర్​లో 42.1, జంబుగలో 42, బయ్యారంలో 41.9, దస్తూరాబాద్​లో 41.6, ఆదిలాబాద్​ అర్బన్​లో 41.3, నాగారం 41.1, తెల్దేవరపల్లి, కల్వకుర్తిల్లో 40.5, పెబ్బేరులో 40.3 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. పాలకుర్తిలో 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)