హైదరాబాద్‌లో కానిస్టేబుల్ దుర్మరణం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ని గ్రే హౌండ్స్ వీరస్వామి (45)గా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వీరస్వామి స్నేహితుణ్ని కలిసి  రాత్రి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర వెళ్తుండగా బైక్ జారి పడిపోయారు. ఆ సమయంలో విద్యుత్ వైరు తగిలి చనిపోయినట్లు తెలిసింది. రాత్రంతా కుండపోత వాన కురిసింది. వానకు తోడు భీకర గాలులు వీస్తున్నాయి. ఫలితంగా చెట్లు, కరెంటు స్తంభాలు, హోర్డింగులు కూలుతున్నాయి. జోరు వానకు లోతైన ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నిన్న సాయంత్రం నుంచి భారీ వాన కురుస్తూనే ఉంది. అర్థరాత్రి పెద్ద వాన కురిసింది. దాంతో పల్లపు  ప్రాంతాల్లో వరద నీరు ఉంది. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు వర్ష సూచన ఉంది. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా... తమిళనాడు వరకూ ద్రోణి కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)