నా కూతురి వల్లే రిషి సునక్ ప్రధాని కాగలిగాడు !

Telugu Lo Computer
0


‘భార్య తలచుకుంటే భర్తను గొప్పవాడిగా తీర్చిదిద్దగలదు, నా అల్లుడు రిషి సునక్‌ను బ్రిటన్ ప్రధానిని చేయడం నా కూతురు అక్షత వల్లే సాధ్యమైంది’ అని  ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధా నారాయణమూర్తి అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సుధామూర్తి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. సంపన్న కుటుంబంలో ఉన్నాసాదా సీదాగా ఉంటారు. కట్టు, బొట్టు, మాటతీరుతో చాలామందిని ఇన్ స్పైర్ చేస్తారు. ఈ దంపతుల ముద్దుల తనయ అక్షత 2009 లో రిషి సునక్‌ని వివాహమాడారు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో సుధామూర్తి తన కూతురు, అల్లుడి గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అల్లుడు రిషి సునక్ అతి చిన్న వయసులో బ్రిటన్ ప్రధాని కాగలిగాడంటే అందుకు తన కుమార్తె ప్రోత్సాహమే కారణమన్నారామె. తాను తన భర్తను వ్యాపారవేత్తను మాత్రమే చేయగలిగానని చెప్పుకొచ్చారు. అక్షత తన కుటుంబాన్ని తన భర్తని ఎలా తీర్చిదిద్దుకుందో వివరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)