మహిళా కాంగ్రెస్‌ నేత సంగీతా శర్మను పదిగంటలపాటు నిర్బంధించిన పోలీసులు

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భోపాల్‌ - ఢిల్లీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అధికార ప్రతినిధి సంగీతా శర్మను బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించి 10 గంటల పాటు స్టేషన్‌లోనే ఉంచినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రధాని పర్యటన సందర్భంగా సంగీతా శర్మ నిరసన తెలుపనుందనే సమాచారంతోనే ఆమెను అరెస్టు చేశామని, పిఎం పర్యటన పూర్తయిన అనంతరం విడుదల చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు తన నివాసానికి వచ్చిన పోలీసులు తనను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించుకుని తీసుకువెళ్లారని సంగీతా శర్మ తెలిపారు. తాను చేసిన నేరమేంటని అడిగితే చెప్పలేదని, తనను ఎవ్వరితో మాట్లాడనివ్వలేదని, పోన్‌ కూడా లాక్కున్నారని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్‌ పంపిన మీడియా సెల్‌ కార్యకర్తలను కూడా తనను కలువకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 గంటలపాటు తనను స్టేషన్‌లోనే ఓపక్కకు కూర్చోబెట్టారని మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)