బాలుడ్ని చంపి కూలర్లో కుక్కారు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదేళ్ల బాలుడు ట్యూషన్‌కు వెళ్లాడు. కానీ, ట్యూషన్ సెంటర్‌కు వెళ్లలేదు. పైగా, రాత్రి పొద్దుపోయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ట్యూషన్ సెంటర్‌కు వెళ్లి అక్కడ చదువుకునే విద్యార్థుల వద్ద ఆరా తీశారు. ఈ బాలుడు ట్యూషన్ సెంటర్ పక్కనే ఉన్న సంతోష్ చౌరాసియా ఇంటికి వెళ్లినట్టు వెల్లడించారు. దీంతో చౌరాసియా ఇంట్లో సోదాలు చేయగా, అక్కడి దృశ్యం చూసి పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలుడిని చంపేసి కూలర్‌లో కుక్కివుండటాన్ని చూసి విస్తుపోయారు. ఈ దారుణం వెనుక అసలు కారణం ఏంటి, కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారా లేక మూఢ నమ్మకాలతో బలిచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)