కాలేజీ అమ్మాయి "షాట్ మోమోస్" !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని సూరత్‌కి చెందిన ఓ అమ్మాయి ఓ వైపు చదువుకుంటూ మోమోస్ వ్యాపారం చేస్తోంది. అయితే రెగ్యులర్ గా విక్రయించే వాటికి కాస్త క్రియేటివిటీని జోడించింది. కొన్ని రకాల సాస్‌లతో ఆమె రూపొందించిన మోమోస్ కి షాట్ మోమోస్ అని పేరు పెట్టింది. బౌల్స్ లాగ తయారు చేసిన మోమోస్ మధ్యలో గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, టోమోటో చట్నీ, మయోన్నైస్ తో ఫిల్లింగ్ చేసి మోమోస్ కి కొత్త లుక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కొత్త టైప్ మోమోస్ ని తినడానికి జనం తెగ ఇష్టపడుతున్నారు. ఆమె దుకాణం ముందు క్యూ కడుతున్నారు. ఈ మోమోస్ షాపు దుకాణంకి సంబంధించిన వీడియోను ఫుడ్ వ్లాగర్ thehungrysurati వీటిని ఎప్పుడైనా టేస్ట్ చేసారా? అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వ్యాపారం బాగా సాగాలని కొందరు, మోమోలను వండి వాటిని కష్టమర్స్ కి చిరునవ్వుతో అందించడం మరింత నచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)