గోవును కాపాడబోయి తల్లీ, కొడుకు సజీవ దహనం

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ మహారాజా గంజ్‌ జిల్లా భుసి అమ్వా గ్రామంలో పశువుల కొట్టాటనికి మంటలు అంటుకోగా అందులో ఉన్న ఆవును కాపాడేందుకు వెళ్లి తల్లి కౌసల్య దేవి, కుమారుడు రామ్ ఆశీష్‌ సజీవ దహనమయ్యారు. దోమల బెడదను నివారించేందుకు చెత్తకు నిప్పు అంటించి పొగబెట్టింది కౌసల్య. అయితే గాలికి ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న పశువుల కొట్టానికి అంటుకున్నాయి. అందులో ఉన్న ఆవును కాపాడేందుకు కౌసల్య లోపలికి వెళ్లింది. పొరపాటున అందులోని స్తంభం తగిలి ఆమె కిందపడిపోయింది. దీంతో తల్లిని కాపాడేందుకు రామ్ కూడా లోపలికి వెళ్లాడు. అయితే ఒక్కసారిగా పైకప్పు కూలి వీరిపై పడింది. అప్పటికే మంటలు భారీగా చెలరేగడంతో ఇద్దరూ అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనలో గోవుకు తీవ్రగాయాలై ప్రాణాలతో బయటపడింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ప్రభుత్వం నుంచి అసవరమైన సహాయ సహకారాలు ఉంటాయని అధికారులు కౌసల్య కుటుంబానికి హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)