కునో నేషనల్ పార్కులో మరో చిరుత మృతి

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌ లో మృతి చెందింది. ఉదయ్ అనే పేరుకలిగిన చిరుత అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మరణించింది. ఈ విషయాన్ని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫార్జెస్ట్ జేఎస్ చౌహాన్ ధృవీకరించారు. ఆదివారం ఉదయం చిరుత అస్వస్థతకు గురికావడాన్ని గమనించిన అటవీశాఖ బృందం .. దానిని వెంటనే వైద్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స నిర్వహించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఉదయ్ అనే చిరుత ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మరణించినట్లు అధికారులు తెలిపారు. కునో నేషనల్ పార్క్‌లో ఇది రెండో చిరుత మరణం. దాదాపు నెల రోజుల వ్యవధిలో కేఎన్‌పీలో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. అంతకుముందు మార్చి 27 న నమీబియా చిరుత సాషా కిడ్నీ వ్యాధి కారణంగా మరణించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఉదయ్‌ను దక్షిణాఫ్రికా నుంచి 11 చిరుతలతో పాటు కునోకు తీసుకొచ్చారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుండి ఇరవై చిరుతలను తెప్పించారు. గత ఏడాది నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టిన ఎనిమిది చిరుతల్లో ఒకటైన సాషా మార్చిలో మరణించింది. ఆదివారం రెండో చిరుత మృతితో వాటి సంఖ్య 18కి చేరింది. కాగా చనిపోయిన చిరుతకు నేడు పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఈ పోస్టుమార్టంను వీడియో చిత్రీకరణ చేస్తారు. తరువాత మృతికి కారణాలను వెల్లడిస్తామని అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)