కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్లెక్సీకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లయింగ్ కిస్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 30 April 2023

కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్లెక్సీకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లయింగ్ కిస్ !


తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. కొద్దిరోజులుగా తనదైన స్టైల్‌లో నిరసన ప్రదర్శనలను వ్యక్తం చేస్తూ వస్తోన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవ్వాళ మరో అడుగు ముందుకేశారు. చొక్కా విప్పి హల్‌చల్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. వైసీపీ హయాంలో తాడిపత్రి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న డీజిల్ వినియోగానికి సంబంధించిన లెక్కలను వివరిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల వద్ద తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి హల్‌చల్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని గజదొంగగా అభివర్ణించారు. ఈ ఫ్లెక్సీల్లో ప్రచురించిన సమాచారం అంతా అబద్ధమంటూ ధ్వజమెత్తారు. కావాలంటే మున్సిపాలిటీ లెక్కలను బయటికి తీసి, ప్రజల ముందు పెడతానని సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వీకరించాలని డిమాండ్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉందా అని ప్రశ్నించారాయన. తాను తాడిపత్రి ప్రజలను ఎప్పటికీ మోసం చేయనని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలకు మౌలిక వసతులను కల్పించడానికి సొంతంగా ఖర్చు పెట్టుకోగలనని, అంతే తప్ప ప్రజలను మోసగించనని అన్నారు. తాడిపత్రి ప్రజలు తన గుండెల్లో ఉన్నారంటూ చొక్కా విప్పి చూపించారు. తాడిపత్రి అని రాసివున్న పేపర్‌ను గుండె ఆకారంలో కత్తిరించి, దాన్ని తన కడుపుపై అతికించుకున్నారు.

No comments:

Post a Comment