యువతిపై అత్తింటి వారి అమానుషం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 1 May 2023

యువతిపై అత్తింటి వారి అమానుషం !


జార్ఖండ్‌లో ఓ కుటుంబం కోడల్ని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన దిల్‌దార్‌ అన్సారీ 2022లో రుబికా పహదిన్‌ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి దిల్‌దార్‌ కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. దీనికి తోడు దిల్‌దార్‌కు ఇది రెండో వివాహం. అతడికి ఇదివరకే సురేజా ఖతూన్‌తో పెళ్లయింది. పెళ్లయిన కొన్ని నెలల తర్వాత ఈ విషయం రుబికాకు తెలిసింది. భర్తతో మొదటి పెళ్లి గురించి తరచుగా గొడవపడేది. గొడవ కారణంగా దిల్‌దార్‌ రుబికాపై పగ పెంచుకున్నాడు. దానికి తోడు తల్లిదండ్రులు ఇతర కుటుంబసభ్యులు అతడ్ని రెండో పెళ్లి విషయమై వేధించేవారు. ఆమెను వదిలేయాలని పట్టుబట్టేవారు. ఈ నేపథ్యంలోనే దిల్‌దార్‌ కుటుంబ సభ్యులతో చెయ్యి కలిపి, ఎలాగైనా రుబికా అడ్డుతొలగించుకోవాలని భావించాడు. డిసెంబర్ 17 అందరూ కలిసి ఆమెను హత్య చేశారు. హత్య తర్వాత ఆమె శరీరాన్ని 50 ముక్కలు చేసి ప్లాస్టిక్‌ బ్యాగుల్లో వేసి వేరే వేరు చోట్ల కప్పిపెట్టారు. దిల్‌దార్‌​ తన భార్య ఫోన్‌ను పగులగొట్టాడు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా అందరూ జాగ్రత్త పడ్డారు. రోజులు గడస్తున్నా రుబికా కనిపించకపోవటంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రుబికా అత్తింటి వారి మీద అనుమానంతో వారిని విచారించగా అసలు విషయం బయట పడింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

No comments:

Post a Comment