కొరియోగ్రాఫర్‌ రాజేష్‌ మాస్టర్‌ ఆత్మహత్య

Telugu Lo Computer
0


మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజేష్‌ మాస్టర్‌ కన్నుమూశారు. అతనిది సహజ మరణం కాదని, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే సూసైడ్‌కు గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సౌత్‌ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాజేష్‌ మాస్టర్‌కు మంచి పేరు ఉంది. పలు సినిమాలకు  ఆయన పనిచేశారు. రాజేష్‌ మాస్టర్‌ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్‌ మాస్టర్‌ మరణవార్త తనను షాక్‌కి గురి చేసినట్లు ప్రముఖ నటి బీనా ఆంటోనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)