చంద్రబాబు ఢిల్లీలో తిరిగి చక్రం తిప్పాలి !

Telugu Lo Computer
0


ఢిల్లీలో తిరిగి చక్రం తిప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబును కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటంలో ముందు నిలవాలని, తాముంతా వెనుక అనుసరిస్తామంటూ కేవీపీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయటంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉందని కేవీపీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఎన్‌డీఏ చైర్మన్‌గా వ్యవహరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించకుంటే చరిత్ర హీనుడవుతారని కేవీపీ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జరిగిన అన్యాయంపై రాష్ట్రంలో ఎవరూ ప్రశ్నించకపోవడం ఏమిటని కేవీపీ నిలదీసారు. ఎవరైనా అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం నింద మోపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేవీపీ, మోడీ, అదానీల బృం దాన్ని వివరించారు. కాగా, రాహుల్‌గాంధీకి న్యాయం కోరుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఈనెలాఖరుదాకా ఆందోళనలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తీర్మానించింది. బీసీలను రాహుల్ అవమానించారని ఎలా అంటారో నడ్డా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారన్నారు. జనసేన ఆంతరంగిక సమావేశాల్లోనైనా రాహుల్ గాంధీ అనర్హత విషయాన్ని ఖండించలేకపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన స్థాయిని తనే తగ్గించుకుంటున్నారని కేవీపీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై ఎందుకు స్పందించరని కేవీపీ నిలదీసారు. చంద్రబాబు తనకు తనే గొప్ప నాయకుడని కితాబి చ్చుకుంటారని ఎద్దేవా చేసారు. తనకు ముందు ఏమీ లేదని, తన తర్వాత ఏమీ లేదని చెప్పుకునే కాలజ్ఞాని చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారని గుర్తు చేశారు. చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా రాహుల్ విషయంలో స్పందించాలని డిమాండ్ చేసారు. ఇక్కడ కూర్చుని చక్రాలు తిప్పడం కాదు.. ఢిల్లీ వెళ్లి చక్రాలు తిప్పండన్నారు. ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ రాహుల్ గాంధీ విషయంలో జరిగిన విధానాన్ని ఖండిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ రాహుల్ గాంధీ విషయంలో జరిగిన విధానాన్ని ఖండిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాహుల్ కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దామని.. లేకపోతే రేపటి రోజున ప్రశ్నించే హక్కును కోల్పోతామంటూ కేవీపీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని తక్షణమే ఖాళీ చేయాలనడం దుర్మార్గమన్నారు. ఈ దుర్మార్గాన్ని ఈ దేశపౌరులు ప్రశ్నించాలని కేవీపీ సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)