పాలు, నిమ్మరసం ఎప్పుడూ కలవబోవు !

Telugu Lo Computer
0


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తోబీజేపీ నేత వసుంధరా రాజేకు లోపాయికారీ అవగాహన ఉందంటూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలకు వసుంధరా రాజే తిప్పికొట్టారు. ''పాలు, నిమ్మరసం ఎప్పుడూ కలిసేది ఉండదు'' అని వ్యాఖ్యానించారు. అవినీతి అంశాలపై గెహ్లాట్‌ చర్యలు తీసుకోవడం లేదంటూ పైలట్ ఇటీవల విమర్శలు గుప్పించారు. ఇందుకు నిరసనగా ఆయన ఒకరోజు నిరాహార దీక్ష సైతం చేపట్టారు. ఈ క్రమంలోనే పైలట్ తనపై చేసిన వ్యాఖ్యలను బిష్ణోయ్ సమాజ్ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన వసుంధరా రాజే తిప్పికొట్టారు. ''పాలతో నిమ్మరసం కలుస్తుందా? చాలామంది ఉద్దేశపూర్వకంగానే మేము (రాజే, గెహ్లాట్) కలుసుకున్నట్టు చెబుతున్నారు. మా మధ్య ఏదో అవగాహన ఉందని అంటున్నారు. వేర్వేరు సిద్ధాంతాలు ఉన్న వాళ్లు ఇలా కలుసుకోవడం, అవగాహన కుదుర్చుకోవడం ఎలా సాధ్యం? గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ ముందు ధరల పెరుగుదలతో సహా అనేక సమస్యలు ఉన్నాయి. బిష్ణోయ్ కమ్యూనిటీకి క్షమించే గుణం ఉంది. అయితే క్షమించడానికి అనర్హులు అయిన వారిని ఎప్పడూ క్షమించ కూడదు. అవినీతి అంటే ఒకరకమైన దొంగతనం. సమాజానికి ఎవరైతే మేలు చేస్తారో వాళ్లకు మాత్రమే మద్దతు ఇవ్వాలి. త్వరలోనే మేము మరోసారి ప్రజలకు సేవలు అందించబోతున్నాం'' అని వసుంధరా రాజే అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)