దేశంలో కొత్తగా 7,633 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 7,633 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 61,233గా నమోదైందని వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.14గా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.63 శాతంగా నమోదైందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 5. 04 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 6,702 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,42,474కి చేరింది. రివకరీ రేటు 98.68 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 749 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం కలిపి 92.43 కోట్ల పరీక్షలు చేశారని వివరించింది. గత 24 గంటల్లో 2,11,029 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB1.16 వ్యాప్తి చెందుతోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)