దేశంలో కొత్తగా 12,591 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 12,591 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క రోజే 40 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో 11 మరణాలు కేరళ నుంచే నమోదవ్వడం గమనార్హం నిన్నటితో పోలిస్తే 20 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. అంతేగాక గత ఎనిమిది నెలల్లో ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 65,286 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4.48 కోట్ల మంది వైరస్‌ బారిన పడగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,230కు చేరింది. 4,42,61, 476 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 5.32 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.67 శాతం, యాక్టివ్‌ కేసుల శాతం 0.15 గా ఉంది. కాగా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ XBB.1.16 బాధితులే ఎక్కుగా ఉన్నట్లు వైద్య నిపుణలు పేర్కొన్నారు. కేసులు పెరిగినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌, బూస్టర్‌ డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)