తమన్నా లేడీ రౌడీ గ్యాంగ్‌ హల్‌చల్‌ !

Telugu Lo Computer
0


తమిళనాడులోని కోయంబత్తూరు, విరుదునగర్‌కు చెందిన వినోదిని అలియాస్‌ తమన్నా(23) స్థానికంగా హల్‌చల్‌ చేస్తోంది. ఈ లేడీ రౌడీ కొంత మంది యువకులతో ‍గ్యాంగ్‌ ఏర్పాటు చేసింది. ఈ గ్యాంగ్‌ వారం క్రితం ఓ యువకుడిని హత్య చేసింది. అయితే, స్థానికంగా ఉన్న మరో గ్యాంగ్‌ (గౌతమ్‌ గ్యాంగ్‌)తో నెల రోజులుగా రెండు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లేడీ గ్యాంగ్‌ మరో గ్యాంగ్‌లోని వ్యక్తిని హత్య చేశారు. అనంతరం, లేడీ రౌడీ మారణాయుధాలు చేతిలో పట్టుకుని సిగరెట్‌ తాగుతూ.. వీడియోలు ఫోజులు ఇస్తూ అవతలి గ్యాంగ్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పోలీసులు దృష్టి సారించారు. ప్రత్యర్థి ముఠాలను బెదిరించేందుకే ఈ వీడియోలను పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు కోయంబత్తూరు పోలీసు కమిషనర్‌ వి. బాలకృష్ణన్‌ తెలిపారు. ఈ క్రమంలోనే మరో గ్యాంగ్‌(గౌతమ్‌ బ్యాచ్‌)కు చెందిన 56 మందిని అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)