ప్రాణం తీసిన సిగరెట్ గొడవ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 24 March 2023

ప్రాణం తీసిన సిగరెట్ గొడవ !


కర్ణాటకలోని కలబుర్గి జిల్లాకు చెందిన మల్లినాథ్ బిరాదర్ అనే వ్యక్తి.. బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతంలో ఒక హోటల్‌లో పని చేస్తున్నాడు. అదే హోటల్‌లో అతనితో పాటు గణేశ్ అనే వ్యక్తి కూడా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం వీళ్లిద్దరు కలిసి ఒక షాప్ వద్దకు వెళ్లారు. అక్కడ ఓ సిగరెట్ కొనుగోలు చేశారు. సిగరెట్ షేరింగ్ విషయంలో ఆ ఇద్దరి మధ్య ఓ వివాదం తలెత్తింది. అది చినికి చినికి గాలివానగా మారి, పెద్ద గొడవగా ముదిరింది. ఒకరిపై మరొకరు దాడి కూడా చేసుకున్నారు. అప్పుడు మంజునాథ్ అనే వ్యక్తి జోక్యం చేసుకొని, పరిస్థితిని అదుపు చేశాడు. ఆ గొడవ మరింత ముదరకముందే, సద్దుమణిగేలా చేశాడు. దీంతో ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అయితే మరుసటి రోజు సాయంత్రం మళ్లీ ఈ గొడవ గురించి గణేశ్ ప్రస్తావించాడు. దీంతో గణేశ్, మల్లినాథ్ మధ్య మరోసారి గొడవ మొదలైంది. ఈసారి వీరితోపాటు మంజునాథ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో గనేశ్ కోపం నషాళానికి ఎక్కింది. ఆ కోపంలో అతడు తనతో పాటు తెచ్చుకన్న కత్తి తీసుకొని, మల్లినాథ్‌పై ఎటాక్ చేశాడు. అనేక పోట్లు పొడిచాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మల్లినాథ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అటు.. గణేశ్, మంజునాథ్ కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. వాళ్లు మాత్రం సురక్షితంగానే ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment