ఫిలిప్పైన్స్‌లో భూకంపం

Telugu Lo Computer
0


దక్షిణ ఫిలిప్పైన్స్‌లో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ ప్రభావంతో మరోసారి భూమి కంపించే అవకాశం ఉందని స్థానిక అధికారులు ప్రజలను హెచ్చరించారు. జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ ఫిలిప్పైన్స్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. మధ్యాహ్నం 2.00 గంటల ప్రాంతంలో మిండనావో దీవికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. గోల్డ్ మైనింగ్ ప్రావిన్స్ డావావో డే ఓరో పర్వత ప్రాంతంలోని మరగుసన్ మునిసిపాలిటీకి సమీపంలో 30 సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. జాతీయ రహదారిపై కొండచరియ విరిగిపడిందని, మరగుసన్ విపత్తు నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు. కొండచరియ విరిగిపడటం వల్ల జరిగిన నష్టం గురించి తెలుసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారన్నారు. క్లెమెన్ అనే ఓ వ్యక్తి పోలీసులతో మాట్లాడుతూ, భూకంపం సంభవించినపుడు తాము కార్యాలయంలో ఉన్నామన్నారు. భూమి కంపిస్తున్నట్లు గుర్తించిన వెంటనే తాము బల్లల క్రిందకు దూరిపోయామని చెప్పారు. భూకంపం పూర్తయిన తర్వాత బయటకు వచ్చామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)