ఉమ్మడి పోరాటం చేద్దామని ప్రతిపక్షాలకు షర్మిల లేఖలు !

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేద్దామంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ - బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలకు లేఖలు రాసారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని ప్రతిపాదించారు. పాలనలోని వైఫల్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంతకూ దిగజార్చుతోందని విమర్శించారు. విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. పాలనలో అవినీతికి వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, ఆందోళనలకు కూడా అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలు చేసే వారిపై అధికార మదంతో దాడులు చేస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని ఆ లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోదండరాం, కాసాని జ్జానేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అసదుద్దిన్ ఓవైసి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంభశివరావు, ఎన్ శంకర్ గౌడ్, మందక్రిష్ణ మాదిగలకు షర్మిల లేఖలు రాశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)