మంచి స్నేహితుని కంటే మిన్న పెంపుడు శునకాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 2 March 2023

మంచి స్నేహితుని కంటే మిన్న పెంపుడు శునకాలు !

పెంపుడు శునకాలు మనిషికి మంచి స్నేహితుని కంటే మిన్నగా ఆసరాగా నిలుస్తాయనేందుకు లేటెస్ట్ వీడియో సంకేతంగా నిలుస్తోంది. ఈ వీడియోలో మహిళ మూర్ఛతో కిందపడగా ఆమె తల నేలకు కొట్టుకోకుండా కుక్క స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ది ఫైజెన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా ఇప్పటి వరకూ 40 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వైరల్ వీడియోలో మహిళ మూర్ఛతో బాధపడుతుండగా ఆమె కుప్పకూలి తల నేలకు కొట్టుకోవడం కనపిస్తుంది. ఇదే సమయంలో మహిళ పరిస్ధితిని గమనించిన కుక్క ఆమెను తేరుకునేలా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం సఫలం కాకపోవడంతో మహిళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుక్క ఆమె తల కిందకు చేరి కుషన్‌లా మారుతుంది. మహిళ మూర్ఛకు గురికాగా యజమానురాలి తలను కాపాడిన శునకం..కుక్కలు బెస్ట్ ఫ్రెండ్స్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. కామెంట్స్ సెక్షన్‌ను యూజర్లు లవ్ ఎమోజీలతో నింపేశారు.

No comments:

Post a Comment