కవిత కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా !

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టులో ఈడీ విచారణపై  ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై సోమవారం వాడి వేడి వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు. ఈడీ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. పీఎంఎల్‌ఏ చట్టంపై వాదనలు వినిపించారు ఇరుపక్షాల న్యాయవాదులు. కవిత కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తూ సూప్రీం కోర్టు తీర్పునిచ్చింది. లిఖితపూర్వక నోట్‌ సమర్పించమని సుప్రీం ఆదేశించింది. పిఎంఎల్ఏ సెక్షన్లపైనే వాదన ప్రధానంగా సాగింది. ఇదిలా ఉంటే మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరపడంపై కవిత సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో నళిని చిదంబరం కూడా ఇదే విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. నళిని పిటిషన్‌కు కవిత పిటిషన్‌కు సుప్రీంకోర్టు ట్యాగ్‌ చేసింది. విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)