తవ్వకాల్లో 800 సంవత్సరాల నాటి బంగారు ఆభరణాలు లభ్యం !

Telugu Lo Computer
0


నెదర్లాండ్స్‌లోని ఒక గ్రూప్‌కు చెందిన పురావస్తు శాఖ అధికారులు, ఒక మెటల్ డిటెక్టరిస్ట్ 800 సంవత్సరాల నాటి బంగారు ఆభరణాలను కనుగొన్నారు. ఆ కాలం నాటి చిత్తడి నెలలో వారు తవ్వకాలు జరుపుతుండగా అవి బయటపడ్డాయి. కూజా లాంటి ఓ కుండలో నాలుగు బంగారు చెవి లాకెట్లు, రెండు స్ట్రిప్స్ బంగారు ఆకులు, 39 వెండి నాణేలు ఉన్నాయి. స్థానిక వెస్ట్ ఫ్రైస్‌ల్యాండ్ ప్రాంతంలోని ఉత్తర నగరమైన హూగ్‌వౌడ్‌లో మెటల్ డిటెక్టర్‌ సాయంతో అధికారులు 800 ఏళ్ల క్రితం నాటి చిత్తడి నేలను పరిశీలిస్తుండగా ఈ బంగారు సంపద బయటపడింది. డచ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ యాంటిక్విటీస్‌లోని పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నిధినిక్షేపాలు మధ్యయుగానికి చెందినవిగా ధృవీకరించారు. ఆయా వెండి నాణేలు.. 13వ శతాబ్దంలో యుద్ద సమయంలో తయారు చేయబడినవి అని రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన గుర్తులు వాటిపై ముద్రించబడ్డాయని చెప్పుకొచ్చారు. కాగా, ఇవి ఎప్పుడు తయారయ్యాయన్న విషయాలను తెలుసుకునేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)