గన్నవరం - షిర్డీ విమానానికి అనూహ్య స్పందన

Telugu Lo Computer
0


గన్నవరం నుంచి నేరుగా షిర్డీ విమాన సర్వీసులు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ రోజు విజయవాడ - షిర్డీ, అదే విధంగా షిర్డీ - విజయవాడ సర్వీసులు అందుబాటు లోకి వచ్చాయి. ప్రతీ రోజు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏటీఆర్ 72-600 విమానం షిర్డీకి ఖరారు చేశారు. అందులో 72 మంది ప్రయాణీకుల వెళ్లే సామర్థ్యం ఉంటుంది. తొలి రోజు ప్రయాణానికి టికెట్లు ఫుల్ అయ్యాయి. నిత్యం వేలాది మందిఆంధ్రప్రదేశ్ నుంచి షిర్డీకి వెళ్తుంటారు. ఈ విమానం ద్వారా రెండున్నర గంటల్లోనే షిర్డీ చేరుకొనే అవకాశం దక్కుతుంది. ఇప్పటివరకు విజయవాడ నుండి షిర్డీ వెళ్లాలంటే రోడ్డు లేదా రైలు మార్గంలో 12 గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి వచ్చేది.లేక హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్లైట్‌లో షిర్డీ చేరుకునే వాళ్లు. ఇక నుంచి షిర్డీకి వెళ్లే సాయి భక్తులు విజయవాడలోనే విమానంలో ఎక్కేయొచ్చు. నేటి నుంచి విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. 72 మంది ప్రయాణీకుల సామర్ధ్యంతో ఈ విమానం గన్నవరం - షిర్డీ- గన్నవరం మధ్య సర్వీసు ఈ రోజు ప్రారంభం కానుంది. ప్రతీ రోజు మధ్నాహ్నం 12.25 గంటలకు గన్నవరం లో బయల్దేరే ఈ విమానం 3 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. అదే విధంగా ప్రతీ రోజు షిర్డిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుందని సంస్థ ప్రకటించింది. 2 గంటల 50 నిమిషాల్లోనే షిర్డీకి చేరుకోవచ్చని విమానయాన అధికారులు వెల్లడించారు. గన్నవరం నుంచి షిర్డీకి ప్రారంభ టికెట్ ధర రూ 4,246గా నిర్ణయించారు. అదే విధంగా షిర్డీ నుంచి గన్నవరం కు టికెట్ ధర రూ 4,639గా నిర్దారించారు. ఏపీ జిల్లాల నుంచి ఇప్పటి వరకు షిర్డీ వెళ్లాంటే రైలు ప్రయాణం అందుబాటులో ఉంది. లేదంటే రోడ్డు మార్గం ద్వారా షిర్డీకి చేరుకోవాల్సి వచ్చేంది. షిర్డీలో విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తరువాత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభించారు. శంషాబాద్ నుంచి షిర్డీకి విమాన ప్రయాణం గంటా 34 నిమిషాలు గా ఉంది. టికెట్ ధర రూ 4,086 గా కొనసాగుతోంది. ఇక, ఇప్పుడు నేరుగా గన్నవరం నుంచి షిర్డీకి విమాన సర్వీసులు అందుబాటులోకి రావటం ద్వారా ఆక్యుపెన్సీ రేషియా కూడా బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి షిర్డీకి నిత్యం సాయంత్రం బయల్దేరే మన్మాడ్ ఎక్స్ ప్రెస్ కు భారీ డిమాండ్ ఉంది. నిత్యం వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. శంషాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే విమాన సర్వీసుల్లోనూ ఏపీ నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా ఏపీ జిల్లాల నుంచి షిర్డీకి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తొలుత 72 మంది ప్రయాణీకుల సామర్ధ్యం ఉన్న సర్వీసును ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు బుకింగ్ జరుగుతున్న తీరుతో ఆదరణ బాగానే ఉందని చెబుతున్నారు. ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదరణ పరిశీలించిన తరువాత అవసరమైన విధంగా నిర్ణయాలు తీసుకుంటామని విమానయాన అధికారులు చెబుతున్నారు. దీంతో..షిర్డీ వెళ్లాలనుకొనే భక్తులకు ఈ విమాన సౌకర్యం ప్రయోజనకరంగా ఉంటుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)