బైరవకొనలోని జల లింగం ప్రత్యేకతలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి నుంచి 4, 5 కి.మీల దూరంలో బైరవకొన ఉంది. అక్కడ  ఈశ్వరుడు బైరావుడుగా కొలువైయున్నాడు. చాలా మహిమగల శివలింగం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండమీద ఉండటం వల్ల ఆ కొండల్లో నుంచి వచ్చే నీరు  స్వామివారిని నిత్యం అభిషేకం చేస్తూనే ఉంటుంది. ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలలో ప్రకాశం జిల్లా లో వెలసిన భైరవకోన శైవక్షేత్రం ఒకటి. భైరవకోనలో వెలసిన ఈ శైవక్షేత్రం లో ఎన్నో వింతలు, విశేషాలు భక్తులను భక్తి తన్మయత్వానికి గురి చేస్తుంటాయి. పక్షుల కిల కిల రావాలు, చల్లని పిల్ల గాలులు, ఆకాశన్నంటే చెట్లు. కొండ శిఖరాలనుండి ప్రవహించే జలపాతం, మళ్ళీ మళ్ళీ చూడాలనే తపన..ఎప్పుడు అక్కడే ఉండాలనే సం ఘర్షణల మధ్య భక్తులు పులకించిపోతారు.కొండలు కొనలు, శివోహం.. శివోహం  అంటూ జనఘోషతో మారుమోగుతాయి. వీచే చల్లని గాలులు భక్తులకు ఎక్కడ లేని ఉల్లాశాన్ని, ఉత్సహాన్నిస్తాయి. వాటర్ ఫాల్స్ చూపు ప్రక్కకు తిప్పనివ్వదు. సజీవ కళతో ఉట్టి పడే విగ్రహాలు జీవకోటిని మంత్ర ముగ్ధులను చేస్తాయి. భైరవకోనలో క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ప్రసిద్ధ శివాలయాన్ని పల్లవ రాజులు నిర్మించారు. వారు క్షేత్రంలో ఒకే కొండను తొలిచి, 8 శివాలయాలను ప్రతిష్టించారు. ఇక్కడ 108 శివలింగాలు సైతం భక్తులు దర్శించుకోవచ్చు. అంతేగాక కొండలో నుండి జాలు వారుతున్న జలపాతం మరో ప్రత్యేకత. ఈ జలపాతం లో భక్తులు స్నానమాచరించేందుకు అధిక ఆసక్తి కనబరుస్తారు. ఇలా ఎన్నో వింతలు విశేషాలు ఉన్న భైరవకోన పుణ్యక్షేత్రంలో, మరో విశేషమైన ప్రత్యేకత ఉంది.  భైరవకోనలో కొలువుతీరిన శివలింగాలు ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లోని శివలింగాన్ని పోలి ఉండడంతో, ఇక్కడ ఈ ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు నిరంతరం భైరవకోన క్షేత్రానికి వస్తుంటారు. ఇక్కడి శివలింగాలలో ప్రధానంగా జల లింగం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ శివలింగం అడుగు భాగాన, కాలాలతో సంబంధం లేకుండా ఇంకిపోని జలం ఉండడం విశేషం. జల లింగం అడుగు భాగాన భక్తులు చేయి తో నీటిని తీసుకొని తమపై చల్లుకుంటారు. దీనితో సర్వపాపాలు హరించి, పునీతులవుతారని భక్తుల విశ్వాసం. ఈ జల లింగం అడుగు భాగాన సుమారు 12 అడుగుల లోతులో నీరు ఉంటుందని పురావస్తు అధికారులు సైతం నిర్ధారించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)